
పల్నాడు జిల్లా వినుకొండ మండల పరిధిలోని విటంరాజుపల్లి వద్ద బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







