
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఈ నియామకాలు చేశారు.
వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడిగా బసు లింగారెడ్డిని నియమించారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి రేపాల శ్రీనివాస్, చిలకలూరిపేటకు చిట్టా విజయభాస్కర రెడ్డి, మాచర్లకు కొమ్మినేని వెంకటేశ్వర్లు, నరసరావుపేటకు గుట్టికొండ అంజి రెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గానికి యేనుముల మురళీధర్ రెడ్డి, గురజాలకు పడాల శివా రెడ్డిని నియమించారు.
ఈ పరిశీలకులు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.






