వినుకొండ: వినుకొండ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా శావల్యాపురం మండలం వయ్యకల్లు గ్రామంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, కొన్ని పనులను ప్రారంభించారు.గ్రామంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్వర్ట్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామస్తుల తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు రూ.12 లక్షలతో చేపట్టనున్న కొత్త మంచినీటి పైప్లైన్ పనులను ప్రారంభించారు.ఇక గ్రామంలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రజలకు అంకితం చేశారు. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.









