వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బత్తుల గోపాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు గూడూరు లో విధులు నిర్వహించిన గోపాల్ను పట్టణ ఎస్ఐగా బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.ఇటీవల వినుకొండలో పనిచేసిన ఎస్ఐలు బాలకృష్ణ, రాంబాబు లు ప్రకాశం జిల్లాకు బదిలీ కావడంతో, ఖాళీ అయిన స్థానంలో గోపాల్ బాధ్యతలు స్వీకరించారు.







