
వినుకొండ పట్టణంలోని శివశక్తి లీలా ఆంజనేయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లముల (IOL) వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరం మార్చి 1, 2026న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.
శంకర కంటి ఆసుపత్రి మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ, గుంటూరు సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. శిబిరంలో కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి, శుక్లములతో బాధపడుతున్న అర్హులైన రోగులను ఎంపిక చేసి IOL శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు.
అవసరమైన వారికి రవాణా సదుపాయం మరియు శస్త్రచికిత్స అనంతరం మందులు కూడా అందజేస్తామని పేర్కొన్నారు. వృద్ధులు, ఆర్థికంగా బలహీన వర్గాల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.







