రోడ్డు భద్రత పై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ కృష్ణారావు
ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు చేపట్టారు. ఐనవోలు ఎస్ఐ కృష్ణారావు ఆధ్వర్యంలో మండలంలోని పొదిలి అడ్డరోడ్డు వద్ద శుక్రవారం ప్రత్యేకంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, అవసరమైన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్ చలాన్లు విధించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ కృష్ణారావు సూచించారు.







