⌂ Village News

విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. సస్పెండ్ చేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్: విద్యార్థితో అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎటావా జిల్లాలోని బిరౌలి పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ దినేశ్ కుమార్ ఓ విద్యార్థిని తన కాళ్ల మధ్య కూర్చోబెట్టుకుని, అతడి గుండుపై తబలా వాయిస్తున్నట్లు ప్రవర్తించారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఉపాధ్యాయుడి తీరుపై విమర్శలు రావడంతో అధికారులు అతడిని సస్పెండ్ చేశారు.

WhatsApp