⌂ Village News

వినుకొండలో ఓటు వేసిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వినుకొండ పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదివారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.

WhatsApp