⌂ Village News

వినుకొండ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం

దసరా పండుగను పురస్కరించుకుని వినుకొండ పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఆదివారం నుంచి అక్టోబర్ 20న విజయదశమి వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. 

WhatsApp