⌂ Village News

13న గుంటూరు నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైలు

భక్తుల రద్దీ దృష్ట్యా గుంటూరు నుంచి తిరుచానూరుకు ఈ నెల 13న ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 07227 గుంటూరు జంక్షన్‌ నుంచి సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. ఈ రైలులో 8 ఏసీ, 8 స్లీపర్, 4 జనరల్ బోగీలు ఉంటాయి. సాధారణ ఛార్జీపై 1.3 రెట్లు అదనంగా ఛార్జీ వసూలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

WhatsApp