పల్నాడు జర్నలిస్టుల ఐక్యతకు వేదికగా ప్రథమ మహాసభలు
నరసరావుపేటలో ఏపీడబ్ల్యూజేఎఫ్ (APWJF), ఏపీబీజేఏ (APBJA) పల్నాడు జిల్లా ప్రథమ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత జర్నలిస్టులు యూనియన్ జెండాలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభా ప్రాంగణంలో యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. డప్పుల దరువులు, ఐక్యతా నినాదాల మధ్య ఉత్సాహంగా ప్రారంభమైన ఈ మహాసభలకు పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి జర్నలిస్టులు, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కామెంట్లు