⌂ Village News

వినుకొండ మున్సిపల్‌ చైర్మన్‌ స్థానం ఆర్యవైశ్యులకేనా?

వినుకొండ మున్సిపాలిటీలో 36 వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చైర్మన్‌ పదవి అన్‌రిజర్వుడ్‌ కేటగిరీకి కేటాయించడంతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. ఆర్యవైశ్య వర్గానికి అవకాశం దక్కుతుందా అనే చర్చ సాగుతోంది. మరోవైపు కూటమి, వైసీపీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. వైస్‌ చైర్మన్‌ పదవుల కేటాయింపుపైనా ఆసక్తి నెలకొంది. అయితే అభ్యర్థుల ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

WhatsApp