⌂ Village News

చైర్మన్ పీఠం ఎవరికి? వినుకొండలో కొనసాగుతున్న పోలింగ్

వినుకొండ పురపాలక సంఘ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని 36 వార్డుల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 15 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు

WhatsApp