⌂ Village News

వినుకొండలో రూ.1.10 కోట్లతో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

వినుకొండ: పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులో ఈద్గా వద్ద రూ.1 కోటి 10 లక్షల వ్యయంతో నిర్మించిన విద్యుత్ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. పట్టణంలో విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ప్రాంతంలో విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.

WhatsApp